కావాల్సినవి : అరటికాయ -2, ఉప్పు -1/2 టీస్పూన్ ,పసుపు -1/4 టీస్పూన్ ,కారం -1/2 టీస్పూన్.
తాలింపు కొరకు : నూనె -3 టేబుల్ స్పూన్స్ ,జీలకర్ర -1/4 టీస్పూన్ ,పచ్చిపప్పు -1 టీస్పూన్ ,ఆవాలు -1/4 టీస్పూన్ , వెల్లులి -2, కరివేపాకు -2 రెమ్మలు ,ఎండుమిర్చి- 2, మినపప్పు -1/2 టీస్పూన్.
తయారీ : ముందుగ కడాయిలో నూనె పోసి అది వేడియెక్కిన తర్వాత తాలింపు సామాను మరియు దంచిన వెల్లులి వేసి ఒక నిమిషం వేయించుకోవాలి. అరటికాయ చెక్కు తీసి సన్నగా తరిగిన ముక్కలని వేసుకోవాలి.
తర్వాత ఉప్పు ,పసుపు వేసుకుని ముక్కలు ఎర్రగా అయ్యేవరకు వేయించుకోవాలి. చివరిగా కారం వేసి ఒకసారి కలయబెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో తేలిక అయిన అరటికాయ వేపుడు రెడీ.
No comments:
Post a Comment