కావాల్సినవి: కొబ్బరి తురుము-1 కప్పు, కొబ్బరి పాలు-3 టేబుల్ స్పూన్స్, ఉడికించిన అన్నం-1 పెద్ద కప్పు, పచ్చిమిర్చి-2, ఎండుమిర్చి-2, మిరియాల పొడి-కొద్దిగా, ఆవాలు-1/4 టీస్పూన్, పచ్చిపప్పు-1 టేబుల్ స్పూన్, మినపప్పు-1 టేబుల్ స్పూన్, జీలకర్ర-1 టీస్పూన్ ,జీడీ పప్పు-2 టేబుల్ స్పూన్స్, నూనె-2 టేబుల్ స్పూన్స్, బటర్ -1 టేబుల్ స్పూన్, ఉప్పు-తగినంత, ఇంగువ -చిటికెడు, కరివేపాకు-2 రెమ్మలు, కొత్తిమీర-కొద్దిగా.
తయారీ: స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె మరియు బటర్ వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, జీడీ పప్పు, ఇంగువ, మిరియాలపొడి వేసి పప్పులన్నీ ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. తరువాత కొబ్బరి తురుము వేసి ఉప్పు చల్లి 3 నిమిషాలు వేయించుకోవాలి.
తరువాత ఉడికించి పెట్టుకున్న అన్నమును కడాయిలో వేసి ,కొబ్బరి పాలు ,కొత్తిమీర అన్నం మీద చల్లుకుని అన్ని కలిసేట్టు కలిపి మరో 5 నిమిషాలు తక్కువ మంట మీద మగ్గించుకుంటే ఎంతో రుచికరమైన కొబ్బరి అన్నం సిద్ధం.
No comments:
Post a Comment