తయారీ : ముందుగా చికెన్ కి గంట్లు(Slit) పెట్టి ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో చికెన్ లెగ్ పీసులు, అల్లం వెలుల్లి పేస్ట్, కారం, గరంమసాలా, నిమ్మరసం, నూనె /నెయ్యి మరియు ఉప్పు వేసి బాగా కలిపి 1 లేదా 2 గంటలు నానబెట్టుకోవాలి.
ఇలా నానబెట్టుకోవడం వల్ల మసాలా చికెన్ ముక్కలకి బాగా పట్టి బాగా రుచిగా ఉంటాయి. తర్వాత చికెన్ ముక్కలుని 180 లేదా 200 డిగ్రీల మీద పెట్టుకుని 20 నిమిషాల పాటు గ్రిల్ చేసుకోవాలి. ఒకవేళ చికెన్ ఎర్రగా అవ్వకపోతే మరియొక 5 నుండి 10 నిమిషాలు గ్రిల్ చేసుకోవాలి.
గ్రిల్ అయిన చికెన్ మీద కొద్దిగా చాట్ మసాల మరియు నిమ్మకాయ రసం చల్లుకోవాలి. అంతేనండి రుచికరమైన గ్రిల్ చికెన్ తయారైంది.
No comments:
Post a Comment