తయారీ : ముందుగా కడాయి స్టవ్ మీద పెట్టుకుని నూనె పోసుకోవాలి. అది వేడి ఎక్కిన తరువాత ఆవాలు, జీలకర్ర ,పచ్చిపప్పు, మినపప్పు ,జీడిపప్పు పలుకులు ,కరివేపాకు మరియు ఎండుమిర్చి వేసుకుని అవి చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి , తురిమిన క్యారెట్, ఉప్పు మరియు అల్లం ముక్కలు వేసి ఒక నిమిషం వేపుకోవాలి.
తర్వాత రవ్వ వేసి మరో నిమిషం వేపి చల్లారనివ్వాలి. పెరుగు,సోడా మరియు నీళ్లు పోసి బాగా కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి . తర్వాత ఇడ్లి పాత్రలో నీళ్లు పోసి మరగనివ్వాలి. ఇడ్లీ ప్లాట్లకి నెయ్యి రాసి పిండి వేసి 15 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇడ్లీ ఉడికిందో లేదో చూసి పాత్రని పక్కన పెట్టుకోవాలి. రవ్వ ఇడ్లీని కొబ్బరి చట్నీ, సాంబార్ లేక ఏదైనా రోటి పచ్చడితో రుచిగా ఉంటుంది.
No comments:
Post a Comment