కావాల్సినవి: పెసరప్పు నానబెట్టినవి -1 కప్పు, క్యారెట్ తురుము -1/4 కప్పు ,కొబ్బరి తురుము -2 టేబుల్ స్పూన్లు, కీరదోస తురుము -1/4 కప్పు, నిమ్మరసం -1 టేబుల్ స్పూను, ఉప్పు -1/2 టీస్పూన్ (రుచికి తగినంత), సన్నగా తరిగిన పచ్చిమిర్చి-2, నూనె -2 టేబుల్ స్పూన్లు.
తాలింపు కొరకు: ఆవాలు -1/4 టీస్పూన్ ,జీలకర్ర -1/4 టీస్పూన్ ,పచ్చిపప్పు మరియు మినపప్పు- 1/2 టీస్పూన్ చొప్పున ,ఎండుమిర్చి -2, కరివేపాకు -2 రెమ్మలు.
తయారీ : ముందుగా గిన్నె లోకి నానపెట్టిన పెసరపప్పు ,క్యారెట్ తురుము ,కీరదోస తురుము ,కొబ్బెర తురుము మరియు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కడాయిలో నూనె పోసి అది వేడియెక్కిన తర్వాత తాలింపు సామాన్లు వేసి అవి చిటపటలాడిన తరువాత పెసరపప్పు మిశ్రమంలో వేసి నిమ్మరసం వేసుకుని కలయబెట్టాలి.
అంతే ఆరోగ్యకరమైన మరియు రుచులంకరమైన కోసాంబారి తయారు.
No comments:
Post a Comment