కావాల్సినవి: ఉడికించిన బంగాళాదుంపలు -1 కప్పు (కొంచెం పెద్ద ముక్కలు కోసుకోవాలి), పెద్ద ఉల్లిపాయ ముక్కలు -1 కప్పు(పోడవుగా కోసుకోవాలి), అల్లం వెల్లుల్లి ముద్ద -2 టేబుల్ స్పూన్స్, ధనియాలపొడి -1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి-2, కొత్తిమీర -కొద్దిగా, ఉప్పు-తగినంత, కారం -1 టేబుల్ స్పూన్.
తాలింపుకోసం: నూనె -2 టేబుల్ స్పూన్స్, పచ్చిపప్పు -1 టీస్పూన్, ఆవాలు -1/4 టీస్పూన్, జీలకర్ర -1/4 టీస్పూన్, కరివేపాకు -2 రెమ్మలు, పసుపు -కొద్దిగా, ఎండుమిర్చి-2.
తయారీ: ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె పోసుకుని అది వేడి అయ్యాక పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండు మిర్చి వేసి వేయించుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి 2 నిమిషాలు వేగనిచ్చి దానిలో అల్లం వెల్లుల్లి ముద్ద వేసి 2 నిమిషాలు తక్కువ మంట మీద వేయించుకోవాలి.
బంగాళాదుంప ముక్కలు, ఉప్పు ,కారం, ధనియాల పొడి వేసి అంతా కలిసేట్టు కలయపెట్టి ,మూత పెట్టుకుని 10 నిమిషాలు మగ్గనివ్వాలి. తరువాత ఒకసారి కూరని కలుపుకుని కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నెలోకి తీసుకుని వడ్డించుకోవాలి. ఈ కూర చపాతీ, రోటి, అన్నంలోకి రుచిగా ఉంటుంది.

No comments:
Post a Comment