తాలింపు కొరకు : ఆవాలు -1/4 టీస్పూన్ , జీలకర్ర -1/4 టీస్పూన్, పచ్చిపప్పు -1/2 టీస్పూన్ ,మినపప్పు -1/2 టీస్పూన్ , ఎండుమిర్చి -2, కరివేపాకు -2 రెమ్మలు, నూనె-2 టేబుల్ స్పూన్లు.
తయారీ : కొబ్బరి, అల్లం మరియు పచ్చిమిర్చి ని మిక్సీ లో మెదుపుకోవాలి . తర్వాత ముడి చింతకాయ పచ్చడి పల్లీలు మరియు 1/4 గ్లాస్ నీళ్లు పోసి మెత్తగా మెదుపుకోవాలి. తరవాత కడాయిలో నూనె పోసి తాలింపు సామాను వేసుకోవాలి అవి చిటపటలాడిన తరవాత పచ్చడిలో వేసి కలుపుకోవాలి. చింతకాయ కొబ్బరి పచ్చడి సిద్ధం. ఇది అన్నం, చపాతీ ,ఇడ్లి, దోస, చపాతీ మరియు రోటీలోకి చాల రుచిగా ఉంటుంది.
గమనిక :
- చింతకాయ ముడి పచ్చడి లేనపుడు చింతపండు వేసి ఉప్పు మీ రుచికి తగినట్లు సరిచూసుకుని వేసుకొనగలరు.
- చింతకాయ ముడి పచ్చడిలో ఉప్పు ఉంటుంది కనుక మళ్ళి వేసుకోనక్కర్లేదు.
- పల్లీలు వేసుకోకపోయినా పర్వాలేదు.
No comments:
Post a Comment