కావాల్సినవి: ఉడికించిన పాస్తా -1 కప్పు, కాప్సికం ముక్కలు -1/2 కప్పు. క్యారెట్ ముక్కలు -1/2 కప్పు, బ్రోకలీ -1కప్పు, టమాటా -1, గౌడా చేసే -1 కప్పు, పచ్చి బఠాణి -1/2 కప్పు. బాసలికం -కొద్దిగా, మిరియాలపొడి -కొద్దిగా.
సాస్ కోసం: మైదా -3 టేబుల్ స్పూన్స్. పాలు- 1 గ్లాస్, చీజ్ -3 టేబుల్ స్పూన్స్, పంచదార -చిటికెడు, ఉప్పు -చిటికెడు, బటర్ -2 టేబుల్ స్పూన్స్ .
తయారీ: స్టవ్ మీద గిన్నె పెట్టి పాలు పోసి అది వేడి అయ్యాకా బటర్ ,మైదా వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత పంచదార .ఉప్పు ,చీజ్ వేసి తిప్పుతూ ఉంటె చిక్కగా క్రీంలా అవుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. తరువాత ఔఫ్ లోఫ్ చేసుకోటానికి ట్రే ఉంటుంది అది తీసుకొని మొదట పాస్తా వేసి, తరువాత మిగిలిన కూరగాయ ముక్కలు మీకు నచ్చినట్టు ఒక దాని తరువాత ఒకటి వేసుకుని, వాటి మీద ముందుగా చేసి పెట్టుకున్న వైట్ సాస్ వేసి చీజ్ చల్లుకుని మిరియాలపొడి, బాసలికం పొడులు పైన చల్లి ఒవేన్ లో పెట్టుకుని 200 డిగ్రీ లో 20 నిమిషాలు పాటు వేడి చేసుకోవాలి.
గమనిక: మష్రూమ్స్, జుకీనీ ఇలా మీకు నచ్చిన కూరగాయ ముక్కలు వేసుకొనవచ్చు. అలానే పాస్తా ఉడికించేటప్పుడు సాల్ట్, నూనె వేసుకుని ఉడికించుకోండి. టమాటా ముక్కలుగా ఇష్టం లేని వాళ్ళు పాస్తా సాస్ వేసుకుని కలుపుకుని దాని మీద కూరగాయ ముక్కలు వేసుకోండి. అలానే ఒవేన్ అందరిది ఒకవిధంగా ఉండదు కనుక మీరు మధ్య మధ్యలో ఉడికిందిలేనిది చూసుకుంటూ ఉండండి.
No comments:
Post a Comment