కావాల్సినవి: చింతపండు- పెద్ద నిమ్మకాయంత, ఉల్లిపాయ -1, పచ్చిమిర్చి-3, కారం-1 టేబుల్ స్పూన్, పసుపు-కొద్దిగా, ఉప్పు-తగినంత, కరివేపాకు-2 రెమ్మలు, వెల్లుల్లి-2 రెబ్బలు, జీలకర్ర-1/2 టీస్పూన్, వాము-1 టేబుల్ స్పూన్, కొత్తిమీర-తగినంత, ఎండు మిర్చి-1, నూనె-2 టేబుల్ స్పూన్స్, పచ్చిపప్పు-1 టీస్పూన్.
తయారీ: ముందుగా చింతపండుని ఒక గిన్నెలో వేసి నీరు పోసి 5 నిమిషాలు నాన పెట్టుకుని బాగా పిసికి రసం తీసుకోవాలి. తరువాత మిగిలిన పిప్పిని తీసి వేసి పులుపు సరి చూసుకుని కావాలి అంటే మరికొంచెం నీరు పోసుకుని ఉప్పు,కారం,పసుపు వేసి చింతపండు రసాన్ని బాగా మరిగించుకోవాలి.
తరువాత ఒక కడాయి స్టవ్ మీద పెట్టి నూనె వేసి వేడి అయ్యాక జీలకర్ర,పచ్చి పప్పు,వాము,కరివేపాకు,ఎండు మిర్చి వేసి వేగాక పొడవుగా కోసుకున్న ఉల్లిపాయముక్కలు ,పచ్చి మిర్చి,వెల్లుల్లి వేసి ఉప్పు చల్లి 3 నిమిషాలు వేయించుకుని ,ఈ పోపుని మరుగుతున్న చింతపండు రసంలో వేసి కలిపి,కొత్తిమీర చల్లి మరో 5 నిమిషాలు మరిగించుకోవాలి. అంతే ఎంతో ఆరోగ్యకరం మరియు రుచికరం అయిన వాము చారు సిద్ధం.

గమనిక: కొంచెం తీపి ఇష్టపడే వారు 1/2 టీ స్పూన్ పంచదార వేసుకొంటే ఎంతో రుచిగా ఉంటుంది.
No comments:
Post a Comment