కావాల్సినవి : పెసరపప్పు -1 కప్పు ,బియ్యం -2 కప్పులు ,నెయ్యి -4 టీస్పూన్లు ,జీడిపప్పు -10, మిరియాలు -1 టీస్పూను ,పచ్చిమిర్చి -3 లేక 4, అల్లం -1 అంగుళం ,కరివేపాకు -2 రెమ్మలు ,జీలకర్ర -1/4 టీస్పూన్ ,మినపప్పు -1/2 టీస్పూన్ ,పచ్చిపప్పు -1/2 టీస్పూన్, ఉప్పు-1 టీస్పూన్ / తగినంత, పసుపు -1/4 టీస్పూన్.
తయారీ : ముందుగా కుక్కర్ ని స్టవ్ మీద పెట్టుకోవాలి. రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని పెసరపప్పు మరియు బియ్యం వేసి ఒక నిమిషం వేయించుకొవాలి. ఉప్పు మరియు పసుపు వేసి కప్పుకు రెండు కప్పుల నీళ్లు లెక్కన మొత్తం 6 కప్పుల నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి.
తరువాత కడాయి స్టవ్ మీద పెట్టుకుని మిగిలి రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని జీడిపప్పు, మిరియాలు, మినపప్పు, పచ్చిపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి మరియు అల్లంని వేసుకుని ఒక నిమిషం వేయించి ఉడికించుకున్న పెసరపప్పు అన్నంలో వేసుకుని బాగా కలుపుకోవాలి . అంతే మీ ముందు రుచికరమైన కట్టె పొంగలి తయారు.
గమనిక : పొంగలి జారుగా ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం నీరు పోసి ఉడికంచుకోవాలి.
No comments:
Post a Comment