కావాల్సినవి : దొండకాయలు -1/2 కేజీ ,పసుపు -చిటికెడు ,ఉప్పు -తగినంత ,నూనె -5 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ -1, టమాటా -1 చిన్నది.
కొబ్బరి కారం కొరకు: కొబ్బెరి తురుము/ ఎండుకొబ్బరి/ పచ్చి కొబ్బరి - 2 టేబుల్ స్పూన్లు, వెల్లులి రెబ్బలు -3, కారం -1 టీస్పూన్.
తాలింపు కొరకు : ఆవాలు -1/4 టీస్పూన్ , జీలకర్ర -1/4 టీస్పూన్ , పచ్చిపప్పు- 1 టీస్పూన్ , మినపప్పు -1 టీస్పూన్ ,ఇంగువ -చిటికెడు ,కరివేపాకు -2 రెమ్మలు , ఎండుమిర్చి -2.
తయారీ: ముందుగా కొబ్బరి కారం కొరకు పెట్టుకున్న సామాన్లని మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఒక కడాయి తీసుకుని నూనె వేడెక్కిన తరువాత తాలింపు సామాను వేసుకోవాలి.
అవి చిటపటలాడిన తర్వాత దొండకాయ ముక్కలు, ఉప్పు మరియు పసుపు వేసి పది నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత తరిగిన ఉల్లిపాయ ,ముక్కలు వేసి మరియొక పది నిమిషాలు వేయించుకోవాలి.
సన్నగా తరగని టమాటా ముక్కలు వేసి ముక్కలు ఎర్రగా అయ్యేవరకు వేపుకోవాలి. చివరిగా కొబ్బరికారం చల్లుకుని ఒక్క నిమిషం కలయబెట్టుకుని సర్వ్ చేసుకోడమే. ఈ వేపుడు అన్నం లోకి చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర నలుగురికి సరిపోతుంది.
No comments:
Post a Comment