కావాల్సినవి: బీరకాయ తొక్కు -1 కప్పు, ధనియాలు-1 టేబుల్ స్పూన్, తెల్ల నువ్వులు-1 టేబుల్ స్పూన్, జీల కర్ర-1 టీస్పూన్, వెల్లుల్లి రెబ్బలు -2/3, పచ్చిమిర్చి-5/6, చింతపండు -కొద్దిగా, టమాటా ముక్కలు -1 చిన్న కప్పు, ఉప్పు-రుచికి సరిపడినంత, కొత్తిమీర -తగినంత.
తాలింపు కొరకు: నూనె-2 టేబుల్ స్పూన్స్, పచ్చిపప్పు-1 టీస్పూన్, జీలకర్ర-1 టీస్పూన్, ఆవాలు-1/2 టీస్పూన్, ఎండుమిర్చి-2, కరివేపాకు-2 రెమ్మలు.
తయారీ: ముందుగా కడాయిలో నూనె వేసుకుని జీలకర్ర, ధనియాలు, నువ్వులు వేసి అవి వేగుతుండగా వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి నిమిషం వేయించి, బీరకాయ తొక్కు, టమాటా ముక్కలు వేసి కొంచెం ఉప్పు చల్లి మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వాలి.
తొక్కు మెత్త బడిన తరువాత చింతపండు, కొత్తిమీర చల్లి మరో 5 నిమిషాలు వేయించాలి. ఈ మిశ్రమము చల్లారాక మిక్సీ లో వేసుకుని మెత్తని గుజ్జు చేసుకోవాలి. తరువాత అదే కడాయిలో నూనె పోసుకుని తాలింపు దినుసులు వేసి పోపు పెట్టుకుని బీరకాయ గుజ్జులో వేసి కలుపుకోవాలి. అంతే బీరకాయ తొక్కు పచ్చడి సిద్ధం. ఇది అన్నంలోకి రుచిగా ఉంటుంది.

No comments:
Post a Comment