కావాల్సినవి: రైస్-1 కప్పు,పెసరపప్పు-1 కప్పు, ఉల్లిపాయ-1, పచ్చిమిర్చి-5, టమాటాలు-3, పాలకూర-1 కట్ట, అల్లం,వెల్లుల్లి ముక్కలు-1 టేబుల్ స్పూన్, చింతపండు-కొద్దిగా, కొత్తిమీర -కొద్దిగా, ధనియాల పొడి-1 టేబుల్ స్పూన్, గరంమసాలా-1 టీ స్పూన్. .
తాలింపు కొరకు: నెయ్యి -2 టేబుల్ స్పూన్స్, ఆవాలు-1/2 టీస్పూన్, జీలకర్ర-1/4 టీస్పూన్, పచ్చిపప్పు-1 టేబుల్ స్పూన్, మినపప్పు-1 టేబుల్ స్పూన్, జీడిపప్పు-10, పసుపు-కొద్దిగా, ఉప్పు-తగినంత, ఇంగువ-చిటికెడు, ఎండుమిర్చి-2/3, కరివేపాకు-2 రెమ్మలు.
తయారీ:ముందుగా ప్రెషర్ కుక్కర్ లో బియ్యం మరియు పెసరపప్పు వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. తరువాత 2 గ్లాసుల నీరు పోసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు,సన్నగా తరిగిన పాలకూర,ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి ముక్కలు మరియు చింతపండు వేసి మూత పెట్టి 4 కూతలు రానివ్వాలి.
తరువాత కుక్కర్ లోని ఆవిరి అంతా పోయాక మూత తీసి ధనియాల పొడి, గరంమసాలా వేసి అన్ని కలిసేట్టు కలుపుకోవాలి. రైస్ ను కొంచెం మెత్తగా కచ్చాపచ్చాగా అయ్యేట్టు మెదుపుకుంటే రుచిగా ఉంటుంది. చివరగా రైస్ లో కొత్తిమీర వేసి కలయబెట్టుకోవాలి. తరువాత కడాయి స్టవ్ మీద పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, జీడిపప్పు, కరివేపాకు, పసుపు మరియు చిటికెడు ఇంగువ వేసి పోపు పెట్టుకొవాలి . ఈ పోపుని అన్నంలో వేసి అంతా కలిసేట్టు కలయపెట్టుకోవాలి. అంతే వేడి వేడి పాలకూర కిచిడి సిద్ధం.
గమనిక:కిచిడి గట్టిగా ఉంటె నీరు పోసుకుని పలచగా చేసుకోవచ్చు. అలాగే పెసరపప్పు మరియు కంది పప్పు కలిపి కూడా కిచిడికి ఉపయోగించవచ్చు.పాలకూర ఆకుకి బదులుగా పాలకూర ని గుజ్జులా చేసి కూడా ఉపయోగించవచ్చు.
No comments:
Post a Comment