తయారీ :
కుక్కర్ గిన్నె/రైస్ కుక్కర్ గిన్నె స్టవ్ మీద పెట్టుకుని నెయ్యి పోయాలి. నెయ్యి వేడి అయ్యాక చెక్క ,లవంగాలు, యాలకలు, మరాఠి మొగ్గ, అనాసపువ్వు వేసి ఒక నిమిషం వేపుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు ,పచ్చిమిర్చి ,కరివేపాకు మరియు జీడిపప్పు వేసి ఒక నిమిషం వేగాక అల్లంవెల్లులి ముద్ద వేసి పచ్చి వాసన పోయేవరకు వేపుకోవాలి (సుమారు 2 నిమిషాలు).
తర్వాత బియ్యం వేసి ఒకసారి కలపాలి. ఉప్పు మరియు పసుపు వేసి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లు పోసి కొత్తిమీర మరియు పుదీనా వేసి కుక్కర్ మూతపెట్టి మూడు విస్టల్స్ వచ్చేవరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లేదంటే రైస్ కుక్కర్ లో పెట్టవచ్చు. ఈ రైస్ ని కుర్మాతో కానీ చినెన్ కర్రీతో గాని తింటే బాగుంటుంది.
గమనిక:
బియ్యంలో నీళ్లు పోసాక ఒకసారి ఆ నీటిని రుచి చూసి ఉప్పుని సరిచేసుకోవచ్చు.
No comments:
Post a Comment