కావాల్సినవి : ఓట్స్ -1 కప్పు ,గోధుమ పిండి- 1 కప్పు ,పచ్చిమిర్చి-2, ఉల్లిపాయ - 1 (చిన్నది), కొత్తిమీర -2 రెమ్మలు ,జీలకర్ర - 1/4 స్పూన్ ,ఉప్పు-సరిపడినంత ,నెయ్యి /నూనె -1 స్పూన్.
తయారీ : ముందుగా ఓట్స్ ని మిక్సీ పట్టుకుని పొడిలా చేసుకోవాలి. ఓట్స్ పొడిలో గోధుమ పిండి, సన్నగా తరిగిన ఉలికిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర ,ఉప్పు, నెయ్యి /నూనె వేసి కొద్దీ కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి.
చిన్న ముద్ద తీసుకుని చపాతి కర్రతో గుండ్రంగా రుద్దుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టుకుని అది వేడియెక్కిన తర్వాత చపాతిని కాల్చుకోవాలి. నెయ్యి లేక నూనె వేసి కాలిస్తే ఇంకా రుచిగా ఉంటాయి.
No comments:
Post a Comment