కావాల్సినవి :
కోడి మాంసం -1/2 కేజీ ,ఉప్పు -1 టీస్పూన్ ,పసుపు -1/4 టీస్పూన్ ,కారం -1టీస్పూన్, బిరియాని మసాలా పొడి /గరం మసాలా పొడి -1 టీస్పూన్, యాలకలు -2, లవంగాలు -3, చెక్క -అరంగుళం ,జీలకర్ర -1/4 టీస్పూన్ ,జాజిపువ్వు -1, జవిత్రి -1, అనాసపువ్వు -2, బిరియాని ఆకు (బే లీఫ్ )- 1, పచ్చిమిర్చి -2, పుదీనా -2 రెమ్మలు ,కొత్తిమీర -2 రెమ్మలు ,నిమ్మ రసం - 1 టీస్పూన్, పెరుగు - 4 టేబుల్ స్పూన్లు , బియ్యం (బాస్మతి బియ్యం అయినా వాడవచ్చు) -1.1/2 గ్లాసు(300 ml). ఉల్లిపాయ -1, నెయ్యి /నూనె -2 టేబుల్ స్పూన్లు.
తయారీ :.
ముందుగా కోడి మాంసాన్ని బాగా శుభ్రపరుచుకోవాలి. ఒక గిన్నె తీసుకుని అందులో కోడి మాంసం ,ఉప్పు ,పసుపు ,కారం ,బిరియాని మసాలా పొడి /గరం మసాలా పొడి, యాలకలు, లవంగాలు, చెక్క ,జీలకర్ర ,జాజిపువ్వు, జవిత్రి , అనాసపువ్వు, బిరియాని ఆకు (బే లీఫ్ ), పచ్చిమిర్చి, పుదీనా,నిమ్మరసం, కొత్తిమీర మరియు పెరుగు వేసి బాగా కలపి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. బియ్యాన్ని శుభ్రంగా కడిగి 15 నిమిషాలు నానబెట్టాలి.
No comments:
Post a Comment