కావాల్సినవి : గోంగూర -1 పెద్ద కట్ట, పచ్చిమిర్చి -4, టమాటో - 1/2, ఉల్లిపాయ -1, ఉప్పు- 1/2 టీస్పూన్(తగినంత), పసుపు - చిటికెడు, నూనె - 2టేబుల్ స్పూన్లు.
తాలింపు కొరకు : ఆవాలు -1/4 టీస్పూను, జీలకర్ర -1/4 టీస్పూను, పచ్చిపప్పు -1/2 టీస్పూను, ఇంగువ - చిటికెడు ,మినపప్పు -1/2 స్పూన్ ,కరివేపాకు -2 రెమ్మలు, వెల్లులి -2రెబ్బలు, ఎండు మిరపకాయ -2.
తయారీ : గోంగూరని బాగా శుభ్రపరుచుకుని ఆకులని వేరుచేసుకోవాలి. గిన్నెలో గోంగూర ఆకులు మరియు నీళ్లు పోసి పొంగు వచ్చేవరకు ఉడికించుకోవాలి. పచ్చిమిర్చి మరియు టమాటోని కచ్చాపచ్ఛాగా మిక్సీ వేసుకుని ఉడికించన గోంగూర కూడా వేసి ఒక్కసారి మిక్సీ తిప్పి ఆపేయాలి.
No comments:
Post a Comment