కావాల్సినవి: దోసకాయ ముక్కలు-1 పెద్ద కప్పు, పెద్ద ఉల్లిపాయ-1, టమాటాలు-2, పచ్చిమిర్చి-3, చింతపండు- కొద్దిగా, ఉప్పు-రుచికి తగినంత, కొత్తిమీర-కొద్దిగా, ధనియాల పొడి-1 టీస్పూన్, కారం-1 లేదా రెండు టీస్పూన్స్. తాలింపు కొరకు: నూనె-2 టేబుల్ స్పూన్స్, పచ్చిపప్పు-1 టీస్పూన్, ఆవాలు-3/4 టీస్పూన్, జీలకర్ర -1/2 టీస్పూన్, ఎండుమిర్చి-1,పసుపు-1/4 టీస్పూన్, కరివేపాకు-2 రెమ్మలు.
తయారీ: ముందుగా గిన్నె తీసుకుని నూనె వేయ్యాలి, నూనె వేడి అయ్యాక తాలింపు దినుసులు అన్ని వేసి వేయించుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు చల్లి 3 నిమిషాలు పచ్చి వాసన పోయే వరకు మగ్గనిచ్చి ,తరువాత టమాటా ముక్కలు కూడా వేసి కలయ తిప్పి 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి.
టమాటా ముక్కలు మెత్తగా అయ్యాక, దోసకాయ ముక్కలు వేసి ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి బాగా కలిసేట్టు తిప్పి 3 నిమిషాలు మగ్గనిచ్చి, 1 గ్లాస్ మంచి నీరు పోసి మూత పెట్టి 10 నిమిషాలు దోసకాయ ముక్క మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. చివరగా పులుపు సరిగా ఉందొ లేదో చూసుకుని, తక్కువగా ఉంటె చింతపండు వేసి మరో 3 నిమిషాలు ఉడికించి కొత్తిమీరతో అలంకరించుకోండి.

గమనిక: దోసకాయని కోసినప్పుడు చేదుగా ఉంది ఏమో చూసుకోండి. చేదుగా ఉంటె వంటకి ఉపయోగించకూడదు.
No comments:
Post a Comment