కావాల్సినవి :
మటన్ కీమా - 250 గ్రా, ఉలిపాయలు -1, కరివేపాకు -2 రెమ్మలు ,జీలకర్ర -1/4 టీస్పూన్ ,ఆవాలు -1/4 టీస్పూన్ ,ఉప్పు -తగినంత ,పసుపు -1/4 టీస్పూన్ ,కారం -1 టీస్పూన్, టమాటా -1, కొత్తిమీర -2 రెమ్మలు, నూనె -2 టేబుల్ స్పూన్లు.
మాసాలా : కొబ్బెరి ముక్కలు -2 టేబుల్ స్పూన్లు, ధనియాలు -1 టేబుల్ స్పూన్, లవంగాలు -4, చెక్క -1 అంగుళం ,యాలకలు -2, అల్లం -1 అంగుళం ,వెల్లులి రెబ్బలు -3.
తయారీ :
ముందుగా కడాయిలో ధనియాలు, లవంగాలు, చెక్క మరియు యాలకలని వేసి ఒక నిమిషం వేపుకోవాలి. మసాలా సామాన్లు అల్లం, వెల్లులి మరియు కొబ్బరి వేసి కొంచెం నీళ్లు పోసుకుని మెత్తగా రుబ్బుకోవాలి/ మిక్సీ వేసుకోవాలి. కడాయిలో నూనె పోసుకుని జీలకర్ర, ఆవాలు మరియు కరివేపాకు వేసుకోవాలి.
తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక నిమిషం వేయించుకోవాలి. రుబ్బిన మాసాలని వేసి 3 నిమిషాలు వేయించుకోవాలి. తరువాత మటన్ కీమాని వేసి ఒకసారి కలయబెట్టాలి.
తరువాత ఉప్పు, పసుపు మరియు కారం వేసి 1 నిమిషం వేయించాలి. సన్నగా తరిగిన టమాటో ముక్కలు మరియు పావు కప్పు నీళ్లు పోసి దగ్గర పడే వరుకు ఉడికంచుకోవాలి. చివరిగా కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోడమే.
గమనిక :
ఉప్పు, కారం లేక మసాలాని మీ రుచికి తగినట్లు సరిచేసుకొనవచ్చు.
No comments:
Post a Comment