కావాల్సినవి:
దోసకాయ ముక్కలు -1 పెద్ద కప్పు, కంది పప్పు -1 చిన్న కప్పు, ఉల్లిపాయ -1, పచ్చిమిర్చి -4, చింతపండు - రుచికి సరిపడినంత, ఉప్పు-తగినంత, కారం-2 టీస్పూన్స్.
తాలింపుకొరకు:
నూనె/నెయ్యి -2 టేబుల్ స్పూన్స్, ఆవాలు -3/4 టీ స్పూన్, జీలకర్ర -1 టీస్పూన్, పచ్చిపప్పు -1 టీస్పూన్, పసుపు -3/4 టీ స్పూన్, కరివేపాకు -2 రెమ్మలు, కొత్తి మీర -కొద్దిగా, ఎండు మిరపకాయ -1, ఇంగువ -చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు-2.
తయారీ: ముందుగా కంది పప్పుని కుక్కర్ లో తీసుకుని, శుభ్రంగా కడిగి దానిలో ఉల్లిముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, దోసకాయ ముక్కలు ,చింతపండు, ఉప్పు వేసి, 2 గ్లాస్ ల నీరు పోసి మూతపెట్టి 2 కూతలు వచ్చే వరకు ఉంచాలి.
తరువాత కడాయిలో నూనె పోసి, వేడి అయ్యాక తాలింపు దినుసులు అన్ని వేసి వేగిన తరువాత పప్పు మిశ్రమం లో వేసి కలియబెట్టాలి. చివరగా కారం, కొత్తి మీర కూడా వేసి మరో 10 నిముషాలు పాటు పప్పు దగ్గరికి పడే వరకు ఉడికించుకోవాలి.రైస్ మరియు చపాతీ,రోటిలోకి ఈ పప్పు రుచిగా ఉంటుంది.

No comments:
Post a Comment