బోన్ లెస్ చికెన్ -250 గ్రా, నిమ్మకాయ రసం -1 టేబుల్ స్పూన్ ,కారం -1 టీస్పూన్, కార్న్ ఫ్లోర్ -1 టేబుల్ స్పూన్ , మిరియాల పొడి - 1/4 టీస్పూన్, అల్లం వెల్లులి పేస్ట్ -1 టీస్పూన్, గుడ్డు -1, ఉప్పు - 1/2 టీస్పూన్ (తగినంత ), నూనె -వేపుడుకు తగినంత(1 కప్పు), పసుపు -చిటికెడు.
తయారీ :
ముందుగా మాంసాన్ని బాగా శుభ్రపరుచుకుని, దానిలో నిమ్మకాయ రసం, కారం, కార్న్ ఫ్లోర్, మిరియాలు పొడి, అల్లం వెల్లులి పేస్ట్, గుడ్డు, ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకుని అరగంట నాననివ్వాలి.
తర్వాత కడాయిలో నూనె పోసుకుని, అది బాగా కాగిన తరువాత చికెన్ ముక్కల్ని వేసుకుని ఎర్రగా వేపుకుని కిచెన్ టిష్యూపేపెర్ మీద వేసుకోవాలి. దీనివల్ల అధిక నూనె పీల్చుకుంటుంది.
No comments:
Post a Comment