- వేపుడు కూరలు దించేముందు కొంచెం సెనగపిండి పైన చల్లి కలిపిదించితే మంచి రుచిగా ఉంటుంది.
- పాలు కాచేటప్పుడు కొంచెం తినే సోడా వేస్తే పాలు విరగవు.
- మజ్జిగ చాలకపోతే గోరువెచ్చని పాలలో నిమ్మరసం పిండితే అది మజ్జిగలా తయారవుతుంది.
- పూరి పిండి కలిపేటపుడు కొంచెం చెక్కర కలిపితే పూరీలు చాలాసేపు తాజాగా ఉంటుంది.
- పప్పులు గానీ బియ్యంగాని అర్జెంటుగా నానబెట్టాలి అంటే వేడినీళ్ళలో నానబోస్తే మంచిది.
- పకోడీల పిండిలో కొంచెం వేడినూనె కలిపితే పకోడీలు కారకరలాడుతాయి.
- అన్నం ఉడికేటపుడు అందులో రెండు లేక మూడు చుక్కలు నిమ్మరసం పిండితే అన్నం తెల్లగా మల్లెపువ్వులా ఉంటుంది.
- కూరగాయ ముక్కలని పసుపు కలిపినా నీటిలో ఉంచితే ఏమైనా క్రిములు ఉంటే అవి పైకి తేలిపోతాయి.
- గుడ్లని ఉప్పు నీటిలో ఉడికిస్తే పెంకులు తేలికగా వస్తాయి.
Friday, 4 November 2016
Cooking tips(వంటింటి చిట్కాలు)
Labels:
cooking tips,
vantinti chitkalu
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment