తాలింపుకొరకు: ఆవాలు-3/4 టీస్పూన్, జీలకర్ర-1/2 టీస్పూన్, పచ్చిపప్పు-1 టీస్పూన్, కరివేపాకు-2 రెమ్మలు, పసుపు-కొద్దిగా, ఎండుమిర్చి-1 .
తయారీ: ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి దానిలో నూనె వేడి చేసుకుని ,ఆవాలు. పచ్చిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసి వేయించుకోవాలి. తరువాత అల్లం,వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. తరువాత ములక్కాయ ముక్కలు వేసి ఉప్పు చల్లి కలియబెట్టి 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి.
ములక్కాయ ముక్క కొంచెం మెత్తబడింది అనుకున్నప్పుడు టమాటా ముక్కలు కూడా వేసి కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలిపి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. అవసరం అనుకుంటే కొద్దిగా నీరు పోసుకోవచ్చు.కూర దగ్గర పడిన తరువాత ఉప్పు కారం సరిచూసుకుని, కొత్తిమీర వేసి కలుపుకుని వడ్డించుకోవటమే. అన్నం,చపాతీ మరియు రోటీలోకి ఈ కూర రుచిగా ఉంటుంది.

No comments:
Post a Comment