కావాల్సినవి: పుల్ల పెరుగు-1 కప్పు, పెద్ద ఉల్లిపాయ-1, పచ్చిమిర్చి-4, ఆవాలు-3/4 టీ స్పూన్, జీలకర్ర-1/2 టీ స్పూన్, పచ్చిపప్పు-1 టీస్పూన్, ఎండు మిరపకాయలు-2, అల్లం,వెల్లుల్లి ముక్కలు-1 టీస్పూన్, కరివేపాకు-2 రెమ్మలు, పసుపు-3/4 టీ స్పూన్, ఉప్పు-రుచికి తగినంత, కొత్తి మీర-కొద్దిగా.
తయారీ: ముందుగా పెరుగులో నీరు పోసుకుని పల్చగా మజ్జిగలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టి, నూనె వేసి ఆవాలు,పచ్చిపప్పు ,జీలకర్ర, పసుపు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఉప్పు చల్లి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చివరగా మజ్జిగ కూడా పోసి కలయపెట్టి ఉప్పు సరిచూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తి మీరతో అలంకరించుకోటమే
.
.
No comments:
Post a Comment