కావాల్సినవి :
బోన్ లెస్ చికెన్ - 250 గ్రా, నూనె - 1 టీస్పూన్ ,ఉప్పు -సరిపడినంత , జీలకర్ర పొడి - 1/2 టీస్పూన్, పచ్చిమిర్చి -3, ఉల్లిపాయ -1, అల్లం వెల్లులి పేస్ట్ -1 టీస్పూన్ ,నిమ్మకాయ రసం -1 స్పూన్ ,శెనగపిండి -1 కప్పు, కొత్తిమీర - 2 రెమ్మలు ,వంట సోడా -1/4 టీస్పూన్, పసుపు -1/4 టీస్పూన్ ,కారం - 1/2 టీస్పూన్.
తయారీ :
ముందుగా చికెన్ ని బాగా శుభ్రపరుచుకుని అందులో కొద్దిగా ఉప్పు ,కారం ,పసుపు, జీలకర్ర పొడి, అల్లం వెల్లులి పేస్ట్, నిమ్మకాయ రసం వేసుకుని బాగా కలిపి అరగంట నాననివ్వాలి.
ఒక గిన్నెలో శెనగపిండిలో వంట సోడా మరియు నూనె వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని పేస్టులా కలుపుకుని మారినెట్ చేసిన చికెన్ లో వేసుకోవాలి.
ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మరియు కొత్తిమీర వేసి అన్నిటిని బాగా కలుపుకోవాలి. తరువాత చేతితో పిండిని తీసుకుని బాగా కాగిన నూనె లో వేసుకుని రెండు వైపులా తిప్పుతూ ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. వేడివేడి చికెన్ పకోడీ రెడీ.
No comments:
Post a Comment