కావాల్సినవి: మరమరాలు (బొంగు పేలాలు)-1 పెద్ద కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు-1/2 కప్పు, టమాటా ముక్కలు-1 కప్పు, పచ్చిమిర్చి-2/3, మిక్స్డ్ మిక్సర్-1/2 కప్పు, చాట్ మసాలా -1 టీస్పూన్, నల్ల ఉప్పు- కొద్దిగా, ఉప్పు-తగినంత, నిమ్మరసం-1 టేబుల్ స్పూన్ ,వేయించిన సెనగ పప్పు-1/2 కప్పు, కార్న్ ఫ్లేక్స్ - 3/4కప్పు, కొత్తిమీర-తగినంత.
తయారీ: ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ,వేరుశెనగ పప్పు, కార్న్ ఫ్లేక్స్ , మిక్సర్, నల్ల ఉప్పు, మాములు ఉప్పు, నిమ్మరసం, చాట్ మసాలా వేసి కలిపి, దానిలో మురమురాలు కూడా వేసి కారం చల్లి అన్ని బాగా కలిసేట్టు తిప్పుకుని చివరగా కొత్తి మీర వేసి కలిపి సర్వ్ చేసుకొటమే. అంతే ఎంతో తేలికైన ,రుచికరమైన మూరీ మిక్సర్ రెడీ.
గమనిక: నల్ల ఉప్పు వేయకపోయినా రుచిగానే ఉంటుంది. కనుక సాల్ట్ ఉపయోగిస్తే చాలు. అలానే అన్ని పదార్ధాలు మీకు నచ్చిన కొలతలతో తీసుకోవచ్చు. అలానే అన్ని కూరగాయల్ని బాగా సన్నగా కట్ చేసుకోగలరు. దీన్ని తయారు చేసిన వెంటనే తింటే రుచిగా ఉంటుంది.
No comments:
Post a Comment