తయారీ: ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండి, కొంచెం ఉప్పు, నూనె వేసి మెత్తగా చపాతీ పిండిలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి 3 నిమిషాలు మగ్గనిచ్చి, దానిలో జీలకర్ర పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా, ఆంచూర్ పొడి వేసి 1 నిమిషం వేయించి బంగాళాదుంపలను చిదుముకుని వేసి ,ఉప్పు, కారం వేసి అన్ని కలిసేట్టు కలుపుకోవాలి . ఈ మిశ్రమాన్నీ మెత్తగా గుజ్జులా మెదుపుకోని చల్లారనివ్వాలి. తరువాత గోధుమ పిండి ముద్దని తీసుకుని చివరలు పలుచగా మధ్యలో మందంగా ఉండేట్టు గుండ్రంగా వత్తుకోవాలి .
ఇలా వత్తుకున్న చపాతీ మధ్యలో బంగాళాదుంప మిశ్రమాన్నీ ఉంచి మూసివెయ్యాలి. తరువాత చపాతీ కర్రతో వత్తుతు లోపల పెట్టిన మిశ్రమం బయటికి రాకుండా సమంగా ఉండేట్టు నెమ్మదిగా గుండ్రంగా చేసుకోవాలి. పిండి అంటుకోకుండా ఉండాలి అంటే పొడి గోధుమపిండి చల్లుకుంటూ ఉండండి. ఇలా తయారు అయిన పరాటాలని పెనం మీద నెయ్యి వేసి రెండు వేపులా మీడియం మంట మీద కాల్చుకొని తీసుకోవాలి. అంతే వేడి వేడి ఆలూ పరాట సిద్ధం .
గమనిక: బంగాళ దుంపలని ఉడికించాక తురుముకుని గాని లేదా చాక్ తో సన్నగా తురుగుకొనికానీ ఉపయాగించుకోండి. ఎందుకంటే దుంప ముక్కలు తగులుతూ ఉంటె పరాట సరిగా రాదూ. అలానే ఉల్లిపాయ ,మిర్చి ముక్కలు బాగా సన్నగా తరుగుకోండి. మామిడి పొడి లేని వాళ్ళు చాట్ మసాలా ఒక్కటే ఉపయోగించిన చాలు. లేదా కూరలో కొంచెం నిమ్మకాయ రసం పిండుకొండి .
No comments:
Post a Comment