తాలింపు కొరకు : ఆవాలు -1/4 టీస్పూను, జీలకర్ర -1/4 టీస్పూను, పచ్చిపప్పు -1/2 టీస్పూను, ఇంగువ - చిటికెడు ,మినపప్పు -1/2 స్పూన్ ,కరివేపాకు -2 రెమ్మలు, వెల్లులి -2రెబ్బలు, ఎండు మిరపకాయ -2.
తయారీ: పొట్లకాయ పొట్టుని స్పూన్ తో తీసుకుని, సన్నని ముక్కలుగా తరగాలి. కుక్కర్ లో పొట్లకాయ ముక్కలు మరియు కప్పు నీళ్లు పోసి ఒక్క విజిల్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.
తరువాత కడాయిలో నూనె పోసి తాలింపు సామాను వేసుకుకోవాలి, అవి చిటపటలాడాక తరిగిన ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి వేసి 2 నిమిషాలు వేపుకోవాలి. తరిగిన టమాట ముక్కలని వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి.
తర్వాత ఉడికించిన పొట్లకాయ ముక్కలు, పసుపు ,ఉప్పు మరియు కారం వేసి రెండు నిమిషాలు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
No comments:
Post a Comment