కావాల్సిన పదార్ధాలు: పోడవుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు -1 కప్పు, సెనగపిండి -1కప్పు, బియ్యం పిండి -1/2 కప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి-1 టేబుల్ స్పూన్, వాము-1 టీస్పూన్, కరం-1 టీస్పూన్,కొత్తి మీర -కొద్దిగా, ఉప్పు-రుచికి తగినంత, నూనె- డీప్ ఫ్రై కి సరిపడినంత, వంట సోడా-చిటికెడు.
తయారీ: ముందుగా కడాయిలో డీప్ ఫ్రై కి సరిపడినంత నూనె తీసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడి అయ్యేలోపు ఒక గిన్నెలో శనగపిండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వాము, బియ్యం పిండి, ఉప్పు, కారం, వంట సోడా, కొత్తిమీర వేసి నీరు పోసుకుంటూ పిండిని కొంచెం జారుగా కలుపుకోవాలి. తరువాత చేతితో పిండిని తీసుకుని బాగా కాగిన నూనె లో వేసుకుని రెండు వైపులా తిప్పుతూ ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. వేడివేడి పకోడీని టమాటా సాస్ తో కలిపి అతిధులకు అందించటమే.
No comments:
Post a Comment