కావాల్సినవి: వాము-1టేబుల్ స్పూన్ ,ఉడికించిన రైస్-1 పెద్ద కప్పు, ఆవాలు-3/4 టీస్పూన్, పచ్చిపప్పు-1 టీస్పూన్, జీడిపప్పు-2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి-3, కరివేపాకు -2 రెమ్మలు, జీలకర్ర- 1 టీస్పూన్, ఎండుమిర్చి-2, నూనె/నెయ్యి -2 టేబుల్ స్పూన్లు, ఉప్పు-రుచికి తగినంత, కొత్తి మీర-కొద్దిగా ,అల్లం మరియు వెల్లుల్లి ముక్కలు-1 టీ స్పూన్.
తయారీ: ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె లేదా నెయ్యి వేసి వేడి చెయ్యాలి. దానిలో ఆవాలు,జీల కర్ర, జీడిపప్పు,పచ్చిపప్పు, వాము ,ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగాక ,అల్లము వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగాక ఉడికించిన రైస్ వేసి ,ఉప్పు చల్లి అన్ని కలిసేట్టు తిప్పుకుని చివరగా కొత్తిమీరతో అలంకరించుకోటమే. అంతే వేడి వేడి వాము రైస్ సిద్ధం.
No comments:
Post a Comment