కావాల్సిన పదార్ధాలు: వేరుశనగ విత్తనాలు(పల్లీలు) -1 కప్పు, పచ్చిమిర్చి -7/8, చింతపండు -కొద్దిగా, అల్లం ముక్క చిన్నది, ఉప్పు -రుచికి సరిపడినంత,నూనె -1 టీస్పూన్.
తాలింపుకొరకు: నూనె -1 టేబుల్ స్పూన్, ఆవాలు -1/4 టీస్పూన్, జీలకర్ర -1/4 టీస్పూన్, పచ్చిపప్పు -1/2 టీస్పూన్, ఎండుమిర్చి -2, కరివేపాకు -2రెమ్మలు .
తయారీ: ముందుగా కడాయిలో 1 టీస్పూన్ నూనె పోసుకుని వేరుశెనగ విత్తనాలు, పచ్చిమిర్చి మరియు అల్లం వేసి వేయించుకోవాలి. చివరగా చింతపండు మరియు ఉప్పు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. తరువాత కడాయిలో ఉన్న వాటిని మిక్సీ లో వేసి మెత్తని పేస్టులా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో మిగిలిన నూనె పోసి తాలింపు కొరకు తీసుకున్న సామాను అన్ని వేసి అవి వేగిన తరువాత, ముందుగా చేసి పెట్టుకున్న వేరుశెనగ మిశ్రమంలో కలుపుకోవాలి అంతే వేరుశనగ చట్నీ సిద్ధం. ఈ చట్నీ ఇడ్లీ, దోస, గారెలు ఇలా అన్ని టిఫన్స్ లోకి బాగుంటుంది.
No comments:
Post a Comment