కావాల్సినవి: దొండకాయలు- 1/2 కేజీ, పచ్చిమిర్చి- 7/8, వెల్లుల్లి రెబ్బలు- 3/4, దనియాలు-1 టీస్పూన్, పచ్చిపప్పు, మినప్పప్పు-2 టీస్పూన్స్ చొప్పున, చింతపండు- ఉసిరికాయంత, ఎండుమిర్చి-2.జీలకర్ర -1 టీ స్పూన్, పసుపు- పావు టీస్పూన్. ఉప్పు-తగినంత. కొత్తిమిర - కొద్దిగ, నూనె- 3 టేబుల్ స్పూన్స్.
తాలింపు కొరకు: ఆవాలు-పావు టీ స్పూన్, జీలకర్ర - పావు టీస్పూన్, పచ్చి పప్పు,మినపప్పు-1/2 టీస్పూన్ చొప్పున, కరివేపాకు-2 రెమ్మలు.
తయారీ: ముందుగా కడాయిలో నూనె పోసి వేడి అయ్యాక జీలకర్ర, పచ్చి పప్పు,మినపప్పు,దనియాలు,పసుపు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. దానిలోనే వెల్లుల్లి , పచ్చిమిర్చి కూడా వేసి ఒక 1 నిముషం పాటు వేయించి ,తరువాత దొండకాయ ముక్కలు కూడా వేసి ఉప్పు చల్లి మూత పెట్టి ఒక 15 నిముషాలు మగ్గనివ్వాలి.5 నిమిషాలకి ఒకసారి కలుపుతూ ఉంటె ముక్కలు అన్ని బాగా మగ్గుతాయీ .
ముక్కలు మెత్తబడ్డాక చింతపండు,కొత్తిమీర కూడా వేసి ఇంకో 5 నిముషాలు మగ్గనిచ్చి మంట ఆపేసి చల్లారనివ్వాలి. తర్వాత కడాయిలో ఉన్న ముక్కలు,పప్పులు అన్ని కలిపి మిక్సీ లో మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. చివరగా తాలింపు కోసం కడాయిలో నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు,మినపప్పు, ఎండు మిర్చి,కరివేపాకు వేసి వేయించుకుని, ముందుగా చేసి పెట్టుకున్న దొండకాయ గుజ్జులో కలపాలి. అంతే దొండకాయ పచ్చడి సిద్దం అయిపోయింది. ఈ పచ్చడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాల రుచికరముగా ఉంటుంది.
గమనిక: పచ్చిమిర్చి మరీ ఘాటు కాయలు అయితే మీరు తక్కువ కాయలని తీసుకోగలరు. పచ్చడిని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకున్నా బాగానే ఉంటుంది.
No comments:
Post a Comment