చుట్టూ గంభీరమైన మంచుకొండలు మరియు సరస్సులతో ఈ కోట చూపరులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రతి ఏటా 14 లక్షల మంది ఈ కోటని సందర్శిస్తున్నారు అంటే ఆశర్యపోనక్కర్లేదు. జర్మనీ లోని ముఖ్య సందర్శనాస్థలాలలో ఈ కోట ఒకటి.
schwangau పట్టణ రైల్వే స్టేషన్ నుండి కొట వద్దకు బస్సులు ఉంటాయి. బుస్సు కిటికోలోనుండి ప్రకృతి యొక్క అందాలని ఆస్వాదిస్తూ కోట వద్దకు చేరుకున్నాం. చుట్టూ మంచుకొండల మధ్యలో కోట మమ్ములను ఎంతగానో ఆకట్టుకుంటుంది. రాజుగారు తన రాజ దర్పము ప్రదర్శించడానికి కాకుండా ,సమాజానికి దూరంగా ఉండదలిచి ఈ కోట యొక్క నిర్మిణం జరిపించారట. ఈ కోట లోపల మురల్ యొక్క చిత్రాలు, పెద్ద పెద్ద శాండిలియర్లు మరియు బంగారు రాళ్లతో చేయబడిన విగ్రహాలు మాకు స్వాగతం పలికాయి.
ఈ కోట గోడల మధ్య కృత్రిమ గుహలు మరియు ఉద్యానవనాలు ఉండడం గమనార్హం. అంతేకాదండోయ్ ప్రతి గదిలోను హీటర్లు మరియు ఆటోమాటిక్ ఫ్లష్ (Automatic flush) ఉన్నటువంటి బాత్రూములు ఉన్నాయి. మూడు మరియు నాలుగవ అంతస్థులలో ఫోన్ మరియు లిఫ్ట్(Lift) సౌకర్యం కూడా కలదు. లుడ్విగ్ రాజు యొక్క ఆకస్మిక మరియు అనుమానాస్పద మరణం వరకు కూడా ఈ కోట సంపూర్ణంగా నిర్మింపబడలేదు. అయినప్పటికీ కోట యొక్క అందం ఏమాత్రం తీసిపోలేదు.
కోట పక్కన హ్యాంగింగ్ బ్రిడ్జికి (Hanging bridge) దారి ఉంటుంది. సుమారు 1.5 లేదా 2 కిలోమీటర్లు హైకింగ్ చేసి బ్రిడ్జి వద్దకు చేరుకునవచ్చు.అక్కడి నుంచి మనం కోటని పూర్తిగా చూడవచ్చు. మార్గమధ్యలో మంచు శిఖరాలు మరియు సరస్సులు కనువిందుచేసాయి. ఈ బ్రిడ్జిని రెండు శిఖరాలని కలిపేందుకు తయారు చేసారు. మనం నడుస్తూ ఉంటే బ్రిడ్జి ఊగుతున్నట్లు ఉంటుంది, కింద లోయలోకి చుస్తే ఒకింత భయంగా మరియు కాళ్ళు ఒణికినట్లుగా అనిపించినా ,కోట యొక్క అందాలు, పచ్చని ప్రకృతి సోయగాల మధ్య ఆ భయం దిగదుడుపు అవుతుంది.
ఈ కోట చలికాలంలో మంచుతో కప్పబడి మరింత అందంగా కనిపిస్తుంది. కొండ దిగువ భాగంలో సుమారు 1 కిలోమీటర్ నడిస్తే ఆల్ప్ సి(Alp see) అనే సరస్సు వద్దకు చేరుకొనవచ్చు. చుట్టూ కొండలు మధ్యలో సరస్సు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. సరస్సు యొక్క తీరప్రాంతంలో నడుస్తూ ప్రకృతి ఎదలో సేదతీరరేందుకు ఇది మంచి స్థలం . బస చేయదలిచినవారి కోరకు ఎన్నో హోటల్లు మరియు వసతి గృహములు కలవు.
ఇవండీ ఈ కోట యొక్క విశేషాలు మళ్ళి ఇంకోక సందర్శనా స్థలంతో మీముందు ఉంటాం. ధన్యవాదములు.
No comments:
Post a Comment