కావాల్సినవి: పచ్చి దోసకాయ ముక్కలు -1కప్పు, ధనియాలు- 2 టీ స్పూన్స్, పచ్చిపప్పు-2 టీ స్పూన్స్, మినప్పప్పు- 2 టీ స్పూన్స్ ,వేరుశెనగపప్పు(పల్లీలు )-1టేబుల్ స్పూన్, ఎండు మిర్చి-2/3, జీలకర్ర - 2 టీ స్పూన్స్. పచ్చిమిర్చి-7,చింతపండు-కొద్దిగా ,ఉప్పు -తగినంత.
తాలింపు కొరకు: నూనె -2 టేబుల్ స్పూన్,ఆవాలు-1/2 టీ స్పూన్, పచ్చిపప్పు మరియు మినపప్పు-1 టీ స్పూన్ చొప్పున, ఎండుమిర్చి-1,కరివేపాకు-2 రెమ్మలు , కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి-2/3 రెబ్బలు,పసుపు-చిటికెడు.
తయారీ : ముందుగా ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చి పప్పు,మినపప్పు,వేరు సెనగపప్పు, జీలకర్ర మరియు ధనియాలు వేసి, పప్పులన్నీ దోరగా వేయించుకోవాలి . తర్వాత పచ్చిమిర్చి,చింతపండు కూడా వేసి 3 నిమిషాలు వేయించి స్టవ్ కట్టేయాలి. తరువాత పప్పులన్నీ చల్లబడ్డాక , మిక్సీలో పప్పులు మరియు ఉప్పు కొంచెం కొత్తిమీర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. గుజ్జు మరి గట్టిగ ఉంటే కొంచెం నీరు కలుపుకోవచ్చు.
తరువాత ఈ మిశ్రమాన్ని దోసకాయ ముక్కల్లో వేసి బాగా ముక్కలకి పట్టేట్టు కలుపుకోవాలి. తర్వాత కడాయిలో మిగిలిన నూనె వేసి తాలింపు కొరకు తీసుకున్న సామన్లు అన్ని వేసి అవి వేగాక ముందుగా తయారు చేసి పెట్టుకున్న దోసకాయ మిశ్రమం మీద వేసి బాగా కలపాలి. ఇంక దోసకాయ పచ్చడి సిద్ధం అయినట్టే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ముద్దపప్పుతో దోసకాయ పచ్చడి కలుపుకుని తింటుంటే చాల రుచిగా ఉంటుంది.

No comments:
Post a Comment