Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Wednesday 12 October 2016

Jeedipappu semiya upma, semiya upma (జీడిపప్పు సేమియా ఉప్మా)



                                                                 
కావాల్సినవి:  దోరగా వేయించిన సేమ్యా- 1 కప్పు, తరిగిన పచ్చిమిర్చి- 2 లేక 3, క్యారెట్ - 1 చిన్నది, తరిగిన  ఉల్లిపాయ-1, తరిగిన టమాటా -1, సన్నగా తరిగిన అల్లం ముక్కలు -కొద్దిగా, కొత్తిమీర- 2 రెమ్మలు, నిమ్మ రసం- 2 టీ స్పూన్స్, ఉప్పు- తగినంత



తాలింపు కొరకు: నూనె- 2 టీస్పూన్స్, ఆవాలు- పావు టీస్పూన్, పచ్చిపప్పు- 1/2 టీస్పూన్, జీలకర్ర - పావు టీ స్పూన్, జీడిపప్పు- 20, ఎండుమిర్చి-2, కరివేపాకు- 1 లేక 2 రెమ్మలు.  
తయారీ : ముందుగా ఒక పాత్ర తీసుకుని కొంచెం నూనె పోసి వేడిచేయాలి. దానిలో ఆవాలు, పచ్చిసెనగ పప్పు , జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, మరియు జీడిపప్పు కూడా వేసి దోరగా వేయించాలి. అల్లం, పచ్చిమిర్చి వేసి 1 నిమిషం వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉప్పుకూడా వేసి 2 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి.


తర్వాత క్యారెట్  కూడా వేసి మరో 2 నిమిషాలు వేయించి, టమాటో ముక్కలు వేసి మూత పెట్టి 5 నిమిషాలు వేయించాలి. తర్వాత 2 కప్పుల నీరు మరియు తగినంత ఉప్పు వేసి బాగా మరిగి పొంగు వచ్చేవరకు ఉంచాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న సేమ్యా నినీటిలో వేస్తూ కలపాలి .



తర్వాత కొంచెం కొత్తిమీర వేసి మూతపెట్టి, మంట మీడియం లో ఉంచాలి. మరో 5 నిమిషాలు ఆగి, ఒకసారి సేమ్యాని తిప్పి మూతపెట్టి తక్కువ మంట మీద, నీరు అంతా పూర్తిగా పోయే వరకు ఉంచాలి. తర్వాత స్టవ్ కట్టేసి నిమ్మరసం వేసి కలిపి, చివరిగా కొత్తిమీర చల్లి ప్లేటులోకి తీసుకోవాలి. వేడివేడి జీడిపప్పు సేమ్యా రెడీ అయిపోయింది.



  
గమనిక : సేమ్యా నీటిలో వేసేముందు స్పూనుతో ఆ నీటిని రుచిచూసి ఉప్పుని సరిచూసుకొనవచ్చు . నీరు కొంచెం ఉప్పగా ఉన్నట్టు ఐతే మీరు మళ్లి  ఉప్పు వెయ్య వలసిన పనిలేదు .అలాగే పచ్చిపప్పు మరియు జీడిపప్పు కూడా మీకు కావాల్సినంత తీసుకొనవచ్చు. నూనె బదులు నెయ్యి వాడితే ఉప్మా ఇంకా కమ్మగా ఉంటుంది. 

No comments:

Post a Comment