కావాల్సినవి: సన్నగా తరిగిన బీన్స్-1/2 కేజీ, ఉల్లిపాయ ముక్కలు -1చిన్న కప్పు , పచ్చిమిర్చి-3, పచ్చికొబ్బరి తురుము -2 టేబుల్ స్పూనులు ,కొత్తిమీర తగినంత ,కారం -2 టీస్పూన్స్, ఉప్పు- తగినంత .
తాలింపుకొరకు: నూనె-2 టేబుల్ స్పూనులు, ఆవాలు-1/2 టీ స్పూను, పచ్చిపప్పు-1 టీస్పూను, పసుపు- 1/4 టీ స్పూను, ఎండుమిర్చి-1, జీలకర్ర- 1టీస్పూను, కరివేపాకు-2 రెమ్మలు, వెల్లుల్లి- 3 రెబ్బలు.
తయారీ: ముందుగా కడాయి స్టవ్ మీద పెట్టుకుని నూనె పోసి వేడి చెయ్యాలి. నూనె వేడి అయ్యాక ఆవాలు వేసి అవి చిటపటలాడాక పచ్చిపప్పు, కరివేపాకు, జీలకర్ర ,ఎండు మిర్చి, పసుపు మరియు వెల్లుల్లిని దంచి వేసి పప్పు ఎర్రగా అయ్యే వరకు వేయించాలి.
ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక 2 నిమిషాలు వేయించిన తరువాత బీన్స్ ముక్కలు కూడా వేసి కొంచెం ఉప్పు చల్లి కలిపి మూతపెట్టి 10 నిమిషాలు మీడియం మంట మీద వేయించాలి. ముక్క కొంచెం మెత్తబడ్డాక మూత తీసి మరో 5 నిమిషాలు వేయించి పచ్చికొబ్బరి తురుము ,కారం పొడి చల్లి మరో 5 నిమిషాలు వేయించి, కొత్తిమీర చల్లి స్టవ్ మీద నుండి దించి వెయ్యాలి. టమాటో రసం తో బీన్స్ ఫ్రై నంజుకుని తింటే చాల రుచిగా ఉంటుంది.

No comments:
Post a Comment