Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Wednesday, 12 October 2016

Gummadikaya pulusu/ Gummadikaya kura/ Pumpkin curry


కావాల్సినవి :
గుమ్మడికాయ- 1/4 కేజీ ముక్క ,చిలకడదుంప- 1 పెద్దది ,ఉల్లిపాయ- 1 పెద్దది, పచ్చిమిరపకాయ -2/3, చింతపండు - నిమ్మకాయంత (నీళ్లలో నానపెట్టాలి), బెల్లం -1/2 స్పూన్, కొత్తిమీర- 2 రెమ్మలు, నూనె- 3 స్పూన్స్ ,పసుపు - చిటికెడు , ఉప్పు- తగినంత 
తాలింపు సామాను:
ఆవాలు - 1/4 స్పూన్ , జీలకర్ర -1/4 స్పూన్, పచ్చిపప్పు- 1 స్పూన్, మినపప్పు-1 స్పూన్, ఎండు మిరపకాయలు -2/3, కరివేపాకు -1 రెమ్మ, వెల్లుల్లి - 4 పాయలు, ఇంగువ - చిటికెడు 



తయారీ : 
ముందుగా కడాయిలో నూనె పోయాలి, నూనె వేడెక్కాక తాలింపు సామాను, కచ్చా పచ్చగా దంచిన వెల్లులి వేయాలి. తాలింపు సామాను చిటపటలాడాక ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి.
   


చిలకడదుంప వేసి 5 నిమిషాలు వేయించుకున్నాక, గుమ్మడికాయ ముక్కలు వేసి ఒక కప్పు నీళ్లు, పసుపు మరియు ఉప్పు వేసి మూత పెట్టి 10 నిమిషాలు నీరు దగ్గరికి వచ్చేదాక ఉడికించుకోవాలి.
  

 తర్వాత చింతపండు గుజ్జు పోసి దగ్గరికి వచ్చేదాక ఉడికించుకోవాలి. బెల్లం మరియు కొత్తిమీర వేసి ఒక నిమిషం కలయబెట్టి  పొయ్యి మీద నుండి దింపుకోవాలి. 




గమనిక 
1. చింతపండు నుండి గుజ్జు బాగా రావాలి అంటే రెండు లేదా మూడు సార్లు నీళ్లు పోసి బాగా పిసికి నీరుని వడకట్టాలి. 
2. పులుసులు అప్పటికి అప్పుడు తినే కన్నా, సాయంత్ర లేదా మర్నాడు తింటే బాగా రుచిగా ఉంటుంది. 
సెర్వింగ్: నలుగురికి సరిపోతుంది  


No comments:

Post a Comment