ఈజీ కూరలలో మనకి ముందు గుర్తొచ్చేది బంగాళాదుంప వేపుడు, ఇది వండడానికి తేలికగా ఉండడమే కాకుండా రుచిగా కూడా ఉంటుంది.
కావాల్సినవి :
బంగాళాదుంపలు- 1/2 కేజీ, కరివేపాకు- 2 రెమ్మలు, ఉప్పు- తగినంత , కరం- 1 స్పూను, ధనియాల పొడి - 1 స్పూను, పసుపు - చిటికెడు, ఇంగువ - చిటికెడు, నూనె - 3 స్పూన్లు
తయారీ : ముందుగా బంగాళాదుంపల్ని చిన్న ముక్కలుగా కోసుకోవాలి. నాన్ స్టిక్ పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి నూనె పొయ్యాలి. నూనె వేడెక్కాక ఇంగువ మరియు కరివేపాకు వేస్కోవాలి. కరివేపాకు చిటపటలాడాక బంగాళాదుంప ముక్కలు వేసుకోవాలి .
తర్వాత పసుపు ,కారం ,ఉప్పు మరియు ధనియాలపొడి వేసి ముక్కలు బంగారురంగు వచ్చేవరకు వేపుకోవాలి. అప్పుడప్పుడు ముక్కల్ని గరిటతో తిప్పడం మాత్రం మర్చిపోకండి. ముక్క ఉడికిందో లేదో చూడడానికి ఒకసారి గరిటతో ముక్కని పొడిచి చూడండి ,ముక్క మెత్తగా ఉంటె ఉడికినట్లు. లేదంటే ఇంకో 3 నిమిషాలు వేపుకోవాలి. అంతే అండి తేలికైన మరియు రుచికరమైన బంగాళాదుంప ఫ్రై రెడీ.
No comments:
Post a Comment