Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Monday, 17 October 2016

Carrot kheer(క్యారెట్ ఖీర్)



కావాల్సినవి: క్యారెట్ - 3(పెద్దవి), మిల్క్-1 లీటరు ,పంచదార - 1 కప్పు , జీడిపప్పు-10, కిస్స్మిస్స్- 10, బాదం- 10, పిస్తాపప్పు- 10, యాలకులు -4.




తయారీ: ముందుగా క్యారెట్  ని ముక్కలుగా కోసి ఒక గిన్నె లో వేసి అవి మునిగే వరకు నీరు పోసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. అలా  ఉడికించిన క్యారెట్లని చల్లారనిచ్చి మిక్సీ లో వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి. మరో గిన్నెలో పాలు తీసుకుని మరగ పెట్టాలి. మరుగుతున్నప్పుడే  క్యారెట్ గుజ్జు కూడా వేసి కలిసేట్టు బాగా తిప్పాలి.



తర్వాత జీడిపప్పు, బాదం, కిస్స్మిస్స్, పిస్తా ని చిన్న ముక్కలుగ కట్ చేసుకుని పాలలో వేసుకోవాలి. తరువాత పంచదార కూడా వేసి బాగా కలిపి పాలు చిక్కబడే వరకు తక్కువ మంట  మీద మరిగించాలి. మద్య మద్య లో తిప్పుతూ ఉంటె అడుగు అంటకుండా ఉంటుంది. పాలు దగ్గరగా అయ్యాక యాలకులు దంచి ఖీర్ లో కలపాలి. అంతే ఎంతో రుచికరమైన క్యారెట్  ఖీర్ సిద్ధం అయినట్టే . దీనిని వేడిగా కానీ,  ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చల్లగా తిన్నా సరే ఎంతో రుచికరంగా ఉంటుంది.


No comments:

Post a Comment