కావాల్సినవి: కందిపప్పు - 1 టీ కప్(గిద్దె), చింతపండు- 1 నిమ్మకాయ అంత నీటి లో నానబెట్టాలి , టమాటో- 1, బంగాళాదుంప- 1, క్యారట్ -1, మునగకాయ -1, చిలకడదుంప -1, వంకాయ - 1, పచ్చిమిరపకాయ - 4, ఉల్లిపాయ -1, బెండకాయ -3, కొత్తిమీర- 4 రెమ్మలు, సాంబారు పొడి- 2 టీ స్పూన్ల్స్ , కరం -1 స్పూన్, ఉప్పు- తగినంత, పాసుపు- చిటికెడు
తాలింపుకొరకు: నునే- 2 స్పూన్స్, ఆవాలు - 1/4 స్పూన్, జీలకర్ర - 1/4 స్పూన్, ఎండుమిరపకాయ- 2, కరివేపాకు - 2 రెమ్మలు, వెల్లులి- 3 రెబ్బలు, ఇంగువ- చిటికెడు
తయారీ : ముందుగా కుక్కర్ లో ఒక కప్పు కందిపప్పుకి 2 కప్పులు నీళ్లు పోసి మూడు విజిల్స్ వోచ్చేదాకా ఉంచాలి . ఒక మందపాటి గిన్నె తీస్కుని అంధులో కూరగాయ (బంగాళాదుంప, ఉల్లిపాయ, క్యారట్, మునగకాయ, చిలకడదుంప, వంకాయ, పచ్చిమిరపకాయ, బెండకాయ) ముక్కలు వేయాలి, ముక్కలు మునిగేదాక నీళ్లు పోసి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి.
ఉడికిన ముక్కల్లో ముందుగా మెత్తగా ఉడికికించుకున్న పప్పు,టొమాటోలు మరియు చింతపండు పులుసు వేసి ఒకసారి కలయబెట్టాలి. తరువాత అందులో ఉప్పు,కారం,సాంబార్ పొడి, చిటికెడు పసుపు మరియు కొత్తిమీర వేసి 15 నిమిషాలు మరిగించాలి తరువాత చిన్న కడయిలో నూనె పోసి తాలింపు సామాను వెయ్యాలి,అవి చిటపటలాడాక కరివేపాకు మరియు కచ్చాపచ్చాగా దంచిన వెల్లులి రెబ్బలను వేసి ఒక నిమిషం వేగించి మరిగించిన మిశ్రమంలో కలుపుకోవాలి. .
No comments:
Post a Comment