Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Wednesday 26 October 2016

Juice therapy(జ్యూస్‌ థెరపీ)

ఈ థెరపీ వల్ల ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా ఒత్తిడిని ఎదుర్కొనే శక్తి వస్తుంది. ప్రతినెలా మూడు రోజుల చొప్పున దీన్ని ఆచరించడంవలన శరీరంలోని కణాల్ని శుభ్రపడతాయి. దీనిని ‘డి టాక్స్ జ్యూస్ ఫాస్టింగ్’ అని కూడా అంటారు.
థెరపిలో భాగంగా రోజుకి ఐదారుసార్లు రకరకాల జ్యూస్‌లు తాగాలి. నిమ్మరసంతో మొదలుపెట్టాలి. రెండు గ్లాసుల నిమ్మరసం తాగిన తర్వాత కూరగాయల జ్యూస్ తీసుకోవాలి. తరువాత బత్తాయి రసం తాగాలి. టమాటో, కారెట్, బీట్‌రూట్ జ్యూస్‌లను మధ్యాహ్నం భోజనానికి రెండు, మూడు గంటల ముందు ఇవి తీసుకోవాలి.
మధ్యాహ్నం పుచ్చకాయ, సాయంత్రం తోటకూర లేదా దోసకాయ జ్యూస్ తీసుకోవాలి. నిద్రకు ఉపక్రమించే ముందు బత్తాయి, యాపిల్, ద్రాక్షలను కలిపి జ్యూస్ చేసి తాగాలి.
ఇలా మూడు రోజుల పాటు ఆచరించాలి. తర్వాత రోజుల్లో తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి. అంటే అన్నం, పప్పు, సూప్, కూరగాయల స్టాక్, పెరుగు వంటి ఆహార పదార్థాలన్నమాట. ఈ ఆహారాన్ని నాలుగు రోజులపాటు తీసుకోవాలి. ఆహారంతో పాటు జ్యూస్‌లు కూడా రోజుకు ఒకటి, రెండు సార్లు తాగాలి.
ఈ థెరపీలో ఏయే జ్యూస్‌లు ఎలాంటి ఆరోగ్యాన్ని యిస్తుందో మనం తెలుసుకుందాం
టొమాటో రసం: గుండె జబ్బులకు కారణమయ్యే హైపరాక్టివ్ ప్లేట్‌లెట్లను తగ్గిస్తుంది.
బీట్‌రూట్ రసం: రక్తాన్నివృద్ధిపరుస్తుంది. మంచి శక్తినిస్తుంది. దీనిలో ఉన్న బీటా పొట్టను, పేగులను శుభ్రం చేస్తుంది.
క్యారెట్ రసం: దీనిలోని విటమిన్ -ఎ, కెరొటిన్‌లు కాలేయానికి మేలు చేస్తాయి. బరువు తగ్గడానికి సాయపడుతుంది. కంటిచూపును మెరుగు పరుస్తుంది. పొట్టలో అల్సర్లను నివారిస్తుంది. ప్రధానంగా కాన్సర్ రాకుండా నిరోధిస్తుంది.
తోటకూర రసం: పచ్చి తోటకూర జ్యూస్‌ను అన్నం తినడానికి ముందు రోజుకి రెండుసార్లు తీసుకుంటే రక్తంలో చక్కెర మోతాదు అధికంగా ఉంటే తగ్గిస్తుంది. 
దోసకాయ రసం: ఇది కీళ్ళ వ్యాధులను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది.
కుకుంబర్ రసం: అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. కిడ్నీలను శుభ్రపరిచి అధికంగా ఉండే రక్తపీడనాన్ని తగ్గిస్తుంది. అన్ని రకాల చర్మ సమస్యలను నివారించడానికి దోహదపడుతుంది.
యాపిల్ రసం: చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. హార్ట్ ఎటాక్‌లు,  స్ట్రోక్‌లు రాకుండా నివారిస్తుంది.
ఉసిరి రసం: ఉసిరి జ్యూస్ రక్తంలో చక్కెర స్థాయిలను క్రమపరుస్తుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
బొప్పాయి రసం: జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యల్ని తగ్గిస్తుంది. యాంటి బయాటిక్ మందులు వాడిన తర్వాత శరీరంలోని మంచి బాక్టీరియా నశిస్తుంది. దాన్ని తిరిగి ఏర్పరిచేందుకు బొప్పాయి జ్యూస్ ఉపయోగపడుతుంది.
ద్రాక్షరసం: ఇది అధిక రక్తపీడనాన్ని తగ్గిస్తుంది. ధమనుల గోడలకు విశ్రాంతినిచ్చి, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కార్డియోవాస్కులార్‌ను సంరక్షిస్తుంది.
నిమ్మరసం: బరువు తగ్గడానికి బాగా పనిచేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. మలబద్ధకాన్ని, డయేరియాను అదుపులో ఉంచుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండటంవల్ల రక్తపరిశుభ్రతకు పనిచేస్తుంది. కడుపులో వాయువు, మంటను తగ్గిస్తుంది. ఆకలిని, జీర్ణశక్తిని పెంచుతుంది. కీళ్ళనొప్పులకు, వాతానికి, రక్తపోటుకు, శరీరంలోని వేడిని తగ్గించడానికి నిమ్మరసం దోహదపడుతుంది.
ఇన్ని రకాల కూరకాయలు, పండ్ల రసాలతో జ్యూస్ థెరపి చేస్తే శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. శరీర సౌందర్యానికి కూడా జ్యూస్ థెరపి దోహదపడుతుంది.


No comments:

Post a Comment