కావాల్సినవి :
మిక్స్డ్ స్ప్రౌట్స్ - 1 కప్పు , కిర ముక్కలు- 1/2 కప్పు, టమాటో- 1, ఉల్లిపాయ- 1 చిన్నది , నిమ్మరసం- 1/2 స్పూను , ఉప్పు - తగినంత, కొత్తిమీర- 2 రెమ్మలు ,పుదీనా - 5 ఆకులు, పచ్చిమిర్చి-1.
తయారీ :
టమాటో, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా వీటిని సన్నగా తరుగుకోవాలి. తర్వాత ఒక గిన్నె లో మిక్స్డ్ స్ప్రౌట్స్ ,కిరాముక్కలు ,టమాటో ముక్కలు, ఉల్లిపాయ, ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర మరియు పుదీనా వేసి బాగా కలుపునికి పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలి.
మిక్స్డ్ స్ప్రౌట్స్ :
పెసలు- 1/4 కప్పు, కొమ్ము సెనగలు - 1/4 కప్పు , అలసందలు - 1/4 కప్పు, ఉలవలు - 1/4 కప్పు
వీటిని బాగా నాననివ్వాలి. నానిన ధన్యాలలోని నీళ్లు వడకట్టి ఒక బాక్స్ లో పెట్టి ఆరు గంటలు ఉంచుకోవాలి
గమనిక :
స్ప్రౌట్స్ కి బదులు మీరు నానబెట్టిన దాన్యాలని వాడుకోవచ్చు.
మిక్స్డ్ స్ప్రౌట్స్ కి బదులు ఒక వెరైటీ లో కూడా ఏ సలాడ్ చేసుకోవచ్చ.
No comments:
Post a Comment