Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Tuesday 25 October 2016

pumpkin soup(గుమ్మడికాయ సూప్)

చాల మందికి గుమ్మడికాయతో చేసిన వంటలు నచ్చవు. కానీ గుమ్మడికాయలో 3చాల పోషక విలువలు ఉన్నాయి.  ముఖ్యంగా ఆడవారికి అవసరం అయిన  ఫోలిక్ ఆసిడ్ గుమ్మడిలో పుష్కలముగా ఉంటుంది. దీనిని ఆహారంలో తీసుకోటం చాల మంచిది. గుమ్మడికాయ కూరలా ఇష్టపడని వారికోసం మేము ఈ రోజు  గుమ్మడితో చేసే సూప్ తయారీ  విధానం చెప్పదలిచాము.


కావాల్సినవి: గుమ్మడికాయ ముక్కలు- 1 పెద్ద కప్పు, వెల్లుల్లి తురుము-1 టేబుల్ స్పూన్, ఆలివ్ ఆయిల్ -1 టేబుల్ స్పూన్, ఫ్రెష్ క్రీం- 1/2 కప్పు, వెజిటబుల్ స్టాక్ పౌడర్ -1 టేబుల్ స్పూన్ ,నీరు- 1 పెద్ద గ్లాస్.
తయారీ: ముందుగా ఒక గిన్నెలో నీరు పోసుకుని గుమ్మడికాయముక్కలని ఉడికించుకోవాలి. తరువాత ముక్కలని నీటి నుండి తీసి చల్లారిన తరువాత మిక్సీ లో వేసుకుని మెత్తని గుజ్జులా చేసుకోని పక్కన పెట్టుకోవాలి. 


ఇప్పుడు వేరొక గిన్నె తీసుకుని ఆలివ్ ఆయిల్ వేసి, వేడి అయ్యాక వెల్లుల్లి తురుము కూడా వేసి, 1 నిముషం పాటు వేయించుకుని, ముందుగా తయారు చేసి పెట్టుకున్న గుమ్మడికాయ గుజ్జు కూడా వేసి తక్కువ మంట మీద  3 నిమిషాలు ఉడికించాలి.


తరువాత ఒక చిన్న గిన్నెలో వెజిటబుల్ స్టాక్ పొడి వేసుకుని, నీరు పోసి  ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ స్టాక్ ని గుమ్మడికాయ గుజ్జులో పోసి బాగా కలిసేట్టు తిప్పి 5 నిమిషాలు పాటు ఉడికించాలి. గుజ్జు చిక్కగా ఉంటె నీరు పోసి పలుచగా చేసుకోవాలి. చివరగా క్రీం వేసి 5 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. సూప్ గిన్నెలోకి తీసుకుని మిర్యాల పొడి చల్లుకోవాలి. ఈ సూప్ బ్రెడ్డుతో నంజుకుని తింటే అద్భుతః .


గమనిక:
వెజిటబుల్ స్టాక్ పొడిలో ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుంది, కనుక మీరు ఉప్పుని చివరగా సరి చూసుకుని వేసుకోవచ్చు. మీకు చిక్కగా కావాలి అంటే నీరు పోయకుండా సరాసరి క్రీం వేసి సర్వ్ చేసుకోవచ్చు . 














1 comment: