కావాల్సిన పదార్ధాలు:
పుట్టగొడుగులు- 200 గ్రాములు, పచ్చిమిర్చి-3, టమాటా ముక్కలు-1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు -3/4, అల్లం- 1 చిన్న ముక్క, పచ్చి బఠాణి -1/2 కప్పు, జీలకర్ర-1టీస్పూన్, ఉల్లిపాయముక్కలు -1చిన్నకప్పు, ధనియాల పొడి - 1టీస్పూన్, గరం మసాలా-1టీస్పూన్, నూనె-2టేబుల్ స్పూన్స్, కారం-1 టీస్పూన్, కొత్తిమీర- తగినంత, ఉప్పు-సరిపడినంత, పసుపు-చిటికెడు, నీరు 1/2 కప్పు.
తయారీ: ముందుగా కడాయి తీసుకుని నూనె పోసి ,వేడి అయ్యాక వెల్లుల్లి, పచ్చిమిర్చి,అల్లం వేసి 1 నిముషం పాటు వేయించాక, టమాటా ముక్కలు కూడా వేసి నూనె బయటికి వచ్చే వరకు వేయించుకోని పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమము చల్లారిన తరువాత మిక్సీలో వేసి మెత్తని గుజ్జులా చేసుకోవాలి.
వేరే కడాయి తీసుకుని నూనె పోసి వేడి అయ్యాక జీలకర్ర వేసి వేగాక ఉల్లిపాయముక్కలు, పసుపు కూడా వేసి 3 నిమిషాలు వేగించుకోవాలి. తరువాత ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసి తక్కువ మంట మీద పెట్టి ఒక నిముషం వేయించి, పచ్చి బఠాణి కూడా వేసి మరో 2 నిమిషాలు వేయించుకోవాలి.
దీనిలో ముందుగా చేసుకున్న టమాటా గుజ్జు కూడా వేసి ఉప్పు చల్లి ,మూత పెట్టి నూనె బయటికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. మధ్యలో తిప్పుతూ ఉంటె అడుగు అంటుకోకుండా ఉంటుంది. చివరగా పుట్టగొడుగులు వేసి మసాలా అంతా పట్టేలా కలియబెట్టి ,మూత పెట్టి 3 నిమిషాలు మగ్గనిస్తే పుట్టగొడుగులులోని నీరు బయటికి వస్తుంది.
ఇప్పుడు 1/2 కప్పు నీరు పోసుకుని కొత్తిమీర వేసి కూర దగ్గరపడే వరకు ఉడికించుకోవాలి. చివరగా గిన్నెలోకి తీసుకుని కొత్తిమీరతో అలంకరించుకోవాలి. ఈ కూర చపాతీ ,రోటి, రైస్ తో తినటానికి రుచిగా ఉంటుంది.

గమనిక: ఘాటు తక్కువ తినే వారు మసాలాలు తగ్గించుకుని వేసుకోగలరు.
No comments:
Post a Comment