తయారీ:
- ముందుగా పచ్చి శనగపప్పును నానబెట్టాలి, ఇవి నానడానికి 2 లేక 3 గంటలు పడుతుంది. మీరు సాయంత్రం వడలు వేసుకో దలిచారనుకోండి మధ్యాహ్నమే నానబెట్టాలి . నానబెట్టిన పప్పుని, మసాలా దినుసుల్ని, అల్లం, ఉప్పు మరియు పచ్చిమిర్చిని కచ్చా పచ్చగా మిక్సీ వెయ్యాలి.
- మిక్సీ వేసుకున్న మిశ్రమంలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర మరియు జీలకర్ర వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి నూనె పొయ్యాలి. నూనె కాగిన తర్వాత, చేతి వేళ్ళను కొద్దిగా నీటితో తడుపుకొని నిమ్మకాయంత పిండిని తీసుకుని గుండ్రంగా చేసుకుని చేతి వేళ్ళతో వడల ఆకారంలో వత్తుకోవాలి.
- వత్తుకున్న వడని కాగుతున్న నునె లో వేసి బంగారు రంగు వచ్చేదాకా రెండువైపులా తిప్పుతూ వేపుకోవాలి. మంట మీడియంలో పెట్టుకోవడం మరచిపోకండి. అంతే మీ ముందు వేడి వేడి మసాలా వడలు రెడీ .
గమనిక:
- నూనె కాగిందో లేదో చూడడానికి కొద్దిగా పిండి నూనెలో వేయండి, వెంటనే పైకి వస్తే నూనె కాగినట్లు.
- మంట మీడియంలో ఉంటే వడల రంగు అన్ని పక్కల సమానంగా ఉంటుంది.
No comments:
Post a Comment