మీ చర్మం నిర్జీవంగా ఉందా ?? అయితే వారానికి ఒకసారి మీ ఇంట్లో దొరికే వస్తువులతో స్క్రబ్ తయారు చేసుకుని మసాజ్ చేశారనుకోండి, మీ చర్మాన్ని లోతుగా శుభ్రం చేయడమే కాకుండా కాంతివంతంగా చేస్తుంది.
- నారింజ మరియు తేనే: నారింజ తొక్కని ఎండ పెట్టి పొడి చేసుకుని ,దానిని ఓట్స్ పొడి మరియు తేనేతో సమపాళ్లలో కలిపి మొహానికి వలయాకారం లో మసాజ్ చేసుకొనిన యెడల మీ డెడ్ స్కిన్ పోయీ చర్మం లో జీవం వస్తుంది. .
- అరటిపండు తో ఇలా : బాగా పండిన అరిటిపండుని మెత్తగా చేసుకుని, ఆ మిశ్రమంలో పంచదార కలిపి ముఖానికి, కాళ్ళకి మరియు చేతులకి మసాజ్ చేసుకుని, పది నిమిషములు తరువాత స్నానం చేసిన యెడల చర్మం తేమగా ఉంటుంది.
- పెరుగు మరియు బొప్పాయి: పెరుగులో బొప్పాయి గుజ్జు, తేనే మరియు నిమ్మరసాన్ని సమపాళ్లలో కలుపుకుని మొహానికి మసాజ్ చేసికొనిన యెడల కాంతివంతమైన చర్మం మీ సొంతం .
- చేతులకి కాళ్ళకి ఇలా : నిమ్మకాయని పంచదారని సమపాళ్ళలో కలుపుని చేతులు మరియు కాళ్ళ కి రుద్దుకుని పది నిమిషాలు తరువాత కడుక్కునినా చర్మం మృదువుగా అవుతుంది .ముఖానికి మాత్రం రాయకండి. ఎందుకంటే ముఖం యొక్క చర్మం బాగా సెన్సిటివుగా ఉంటుంది. ఇలా కఠినమైన వాటితో మసాజ్ చేస్తే చర్మం పాడవుతుంది.
- స్క్రబ్ చేయడం ఎలా: ముందుగా ముఖం మీద నీళ్లు చల్లుకుని, మృదువుగా ముఖానికి మరియు మెడకి మసాజ్ చేయాలి . ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదు మరియు మసాజ్ రెండు నిమిషాలకు మించకుండా చూస్కోండి.
- వారానికి ఎన్నిసార్లు స్క్రబ్ చేయాలి: వారానికి రెండుసార్లకి మించి స్క్రబ్ చేయకూడదు. మీది బాగా మృదువైన చర్మం అనుకోండి ఒక్కసారి సరిపోతుంది.
No comments:
Post a Comment