సోపుగింజల టీ జీర్ణ ప్రక్రియకు బాగా దోహదపడుతుంది. మాంసాహారం మరియు భారీగా భోజనం చేసిన తరువాత ఈ టీని తాగారు అనుకోండి తేలికగా జీర్ణం అవుతుంది. మరియు టాక్సిన్స్ కూడా మాయమవుతాయి . దీనిని ఎలా తయారు చేయాలో చూద్దామా ?
కావాల్సినవి: నీరు - 2 కప్పులు , సోపు గింజలు -1 స్పూన్.
తయారీ విదానం:
ముందుగా ఒక గిన్నె లో నీళ్లు పోసి బాగా మరిగించాలి. తర్వాత సోపుని వేసి ఒక నిమిషం మరిగించాలి. ఇక టీ గ్లాస్ లో పోసి తాగేయడమే.
.
గమనిక:
మీరు మరిగించిన సోపు గింజల్నిపారేయకుండా ఇంకోసారి నీళ్లు పోసి మరిగించి టీ తయారు చేసుకోవచ్చు.
No comments:
Post a Comment