కావల్సినవి :
పక్షి గుడ్లు (Quail eggs)- 12, ఉల్లిపాయలు - 1, ఉప్పు - తగినంత , పసుపు - చిటికెడు, కారం - 1 టీస్పూను .
తాలింపు కొరకు :
కరివేపాకు- 2 రెమ్మలు ,ఎండుమిర్చి -2, జీలకర్ర - 1/4 టీస్పూన్, ఆవాలు - 1/4 టీస్పూన్, ఇంగువ - చిటికెడు, పచ్చిపప్పు - 1/2 టీస్పూను, నూనె- 2 స్పూన్.
తయారీ : ముందుగా గుడ్లని 15 నిమిషాల పాటు ఉడికించి, పెంకులు తీసి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో నూనె పోసి తాలింపు సామాను వెయ్యాలి.
అవి దోరగా వేగినతరువాత తరిగిన ఉల్లిపాయల్ని వెయ్యాలి. రెండు నిమిషాల తర్వాత గుడ్లని వేసి ఒక నిమిషం వేయించుకోవాలి.
తరువాత ఉప్పు, కారం, పసుపు వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేస్కోడమే.
No comments:
Post a Comment