Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Monday, 31 October 2016

Beerakaya pachhi pappu kura/ridge gourd curry(బీరకాయ పచ్చిపప్పు కూర)


కావాల్సిన పదార్ధాలు : బీరకాయలు- 2 పెద్దవి, పెద్ద ఉల్లిపాయ-1, నీటిలో నాన  పేట్టిన పచ్చిపప్పు - 1/2 కప్పు,  పచ్చిమిర్చి-3, టమాట -1 పెద్దది , అల్లం వెల్లుల్లి ముద్ద -1 టేబుల్ స్పూన్ , జీలకర్ర-1/2 టీస్పూన్, పసుపు- కొద్దిగా, లవంగాలు-3/4, ఎండుమిర్చి-2, ఆవాలు-1/2టీస్పూన్ ,ఉప్పు-తగినంత, నీరు-1/2 కప్పు, కరివేపాకు-2 రెమ్మలు, కొత్తి మీర -తగినంత, ధనియాలపొడి మరియు గరంమసాల -1 టీస్పూన్ చొప్పున.


తయారీ:
స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె పోసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర ,లవంగాలు, కరివేపాకు, ఎండు మిర్చి వేసి వేగాక ఉలిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి 3 నిమిషాలు పాటు వేగించాలి. తరువాత ముందుగా నీటిలో నాన పెట్టుకున్న పచ్చి పప్పుని వడకట్టి వేయించిన ఉల్లి ముక్కల్లో వేసి కొంచెం ఉప్పు చల్లి కలిపి మూత పెట్టి  5 నిమిషాలు మగ్గనివ్వాలి.


 తరువాత కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలియబెట్టి, రెండు నిమిషాలు తరువాత బీరకాయ ముక్కలు కూడా వేసి కలిపి మూత  పెట్టి మీడియం మంట  మీద  10 నిమిషాలు ఉడికించుకోవాలి. బీరకాయ ముక్క మెత్త పడ్డాక టమాటా ముక్కలు కూడా వేసి మరో 5 నిమిషాలు ఉడికించాలి.

 నీరు తక్కువగా ఉంటె నీరు పోసుకోని కొత్తిమీర కూడా వేసి, కూర దగ్గరికి పడే వరకు ఉడికించుకోవాలి .అంతే రుచిగా ఉండే బీరకాయ పచ్చిపప్పు కూర సిద్ధం. ఇది రైస్ లేక చపాతీతో బాగుంటుంది.


No comments:

Post a Comment