Andhra Recipes Telugu Vantalu Indian Cuisine & Food
హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీకు మన తెలుగువారి వంటిల్లుకి స్వాగతం, సుస్వాగతం. మా పేర్లు ప్రవీణ, రేణుక ,సౌజన్య, మేము ముగ్గురం గృహిణులం. మా భర్తల వృత్తి రీత్యా మేము జర్మనీకి వచ్చి స్థిరపడ్డాం. చాలా మందిలాగే మాకు పెళ్ళికి ముందు వంటలో ఉన్న పరిజ్ఞానం నామమాత్రం. మా అమ్మగారి మరియు అత్తగారి సలహాలు మరియు సూచనలతో వంటలు ప్రారంభించిన మేము వేరే వారు మెచ్చుకునే విధంగా వంటలు నేర్చుకున్నాం. మరియు కొన్ని అంతర్జాతీయ వంటల మీద అవగాహన పెంచుకున్నాం. కొత్త కొత్త వంటలు రుచి చూసి వాటిని ఇంట్లో ప్రయత్నించడం మా అభిరుచి .మీరు కష్టపడకుండా, సునాయాసంగా వంటలు నేర్చుకునేలా తేలిక విధానాలు మరియు చిత్రాలు పొందుపరిచాం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న వారికోసం డైట్ వంటల పట్టిక, ఉద్యోగం చేసే స్త్రీ, పురుషుల కొరకు ఇన్స్టంట్ వంటల పట్టిక , మాకు తెలిసిన చిట్కాలను చిట్కాల పట్టికలోను, మేము రుచి చూసిన రెస్టారెంట్ల యొక్క రివ్యూలు, మరియు మేము పర్యటించిన ప్రదేశాల యొక్క సమాచారం ఇక్కడ పొందుపరచడం జరిగింది .
మీ విలువైన సలహాలని మరియు సూచనల్ని మా ఈ-మెయిల్ కి (prs.bgp@gmail.com) పంపగలరు.
No comments:
Post a Comment